Asianet News TeluguAsianet News Telugu

హిందువుల ఓట్లు కాదు ... కేవలం ముస్లిం ఓట్లతోనే కాంగ్రెస్ గెలుపట.. : సల్మాన్ ఖుర్షీద్ సంచలనం

బిజెెపి హిందుత్వ పార్టీగా, కాంగ్రెస్ కు ముస్లిం, మైనారిటీల అనుకూల పార్టీగా పేరుంది.  అయితే ముస్లింల వల్లే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేాసారు. 

UPA 1 and 2 was formed because of Muslim votes :  Congress leader Salman Kurshid AKP
Author
First Published Apr 29, 2024, 9:52 AM IST

న్యూడిల్లీ : లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు కుల రాజకీయాలకు తెరతీసాయి. బిజెపికి ముందునుండే హిందుత్వ పార్టీగా ముద్రపడగా... కాంగ్రెస్ ముస్లింలకు అనుకూలంగా వుంటుందనే పేరుంది. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు తమకు మద్దతుగా నిలిచే సామాజికవర్గాలకు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లు, ఓటు బ్యాంక్ రాజకీయాలపై మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

దేశంలోని ముస్లీం సమాజమంతా కాంగ్రెస్ కు మద్దతుగా వుందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే యూపిఏ (కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి) రెండుసార్లు అధికారంలోకి రావడమని అన్నారు. ముస్లింలు ఏకపక్షంగా ఓట్లు వేయడంవల్లే యూపిఏ ప్రభుత్వం ఏర్పాటయ్యిందని ఖుర్షీద్ అన్నారు. 
 
భారతదేశంలో మొదటిసారిగా ముస్లింలను మైనారిటీలుగా పేర్కొన్నది కాంగ్రెస్ పార్టీయే అని ఖుర్షీద్ వెల్లడించారు. గతంలో ముస్లింలు అని సంబోదించేవారని... కానీ కాంగ్రెస్ మైనారిటీ అనే పదాన్ని వారికోసమే తీసుకువచ్చిందని అన్నారు. మైనారిటీల్లో ముస్లింలే ఎక్కువ... క్రిస్టియన్, బౌద్దులు, సిక్కుల శాతం చాలా తక్కువ అని పేర్కొన్నారు. 

దేశంలో మైనారిటీల ప్రభావం వుండే జిల్లాలు అనేకం వున్నాయి... అందులో కేవలం ముస్లింల ఆదిపత్యం గల జిల్లాలు 90కి పైగా వున్నాయని ఖుర్షీద్ తెలిపారు. ఇక క్రిస్టియన్లు ఐదారు, సిక్కులు ఒకటి రెండి జిల్లాలో ఎక్కువగా వున్నారు. ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా వుండే ప్రాంతాల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి వుందని...బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థల ద్వారా వారికి ఫండింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. రిజర్వేషన్లలోనూ ముస్లింలకు న్యాయం జరిగేలా చూస్తామని ఖుర్షీద్ తెలిపారు. 

 

దళితులకు 22 శాతం, ఓబిసి లకు 27 శాతం రిజర్వేషన్లు వున్నాయి. అయితే ఓబిసిలో సబ్ కోటాగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను అనుమతించలేదని ఖుర్షీద్ తెలిపారు. 
 
ఓబిసి హిందువులు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు... కానీ ముస్లింలకు సరైన ఉద్యోగాలు లభించడంలేదన్నారు. అందువల్లే  కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఓబిసి రిజర్వేషన్లలో ప్రత్యేక కోటా కోరిందన్నారు. లెదర్ వర్క్ చేసే హిందువుకు రిజర్వేషన్ వుంటుంది... అదే లెదర్ వర్క్ చేస్తే ముస్లింలకు రిజర్వేషన్ వుండదు... ఇదేమిటి అని సల్మాన్ ఖుర్షీద్ ఆందోళన వ్యక్తం చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios