Asianet News TeluguAsianet News Telugu

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ కుట్ర నిజమేనా..? : మోహన్ భగవత్ అభిప్రాయమైతే ఇదే...

మతపరమైన రిజర్వేషన్లు మరీ ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని...  అందుకే బిజెపి వారికి రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ప్రచారంపై స్పందించిన  ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేసారు.... 

Lok Sabha Elections 2024 : RSS chief Mohan Bhagwat reacts on Reservations AKP
Author
First Published Apr 29, 2024, 8:08 AM IST

న్యూడిల్లీ : దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఎప్పుడూ  చర్చనీయాంశమే. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈ రిజర్వేషన్లపై చర్చ మరింత ఎక్కువ అవుతుంది. తాజాగా లోక్ సభ ఎన్నికల వేళ అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రిజర్వేషన్లపై మాటలయుద్దం సాగుతోంది. రిజర్వేషన్లను తొలగించేందుకు బిజెపి కుట్ర చేస్తోందని... మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశాన్ని హిందూ దేశంగా చూడాలనుకుంటోందని... అందుకు బిజెపిని అస్త్రంగా మార్చుకుందని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటివారు ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లు ఎస్సి, ఎస్టి, బిసి, ఓబిసి లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

ఇటీవల ప్రధాని మోదీ కూడా రిజర్వేషన్లపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని... ఎస్సి, ఎస్టి, ఓబిసి లకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు. కర్నాటకలో ముస్లిం లను ఓబిసిల్లో చేర్చడాన్ని మోదీ తప్పుబట్టారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినా ఇదే చేస్తుందని... కాంగ్రెస్ మోడల్ నే అమలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి దేశ ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునే ముందు జాగ్రత్తగా వుండాలని ప్రధాని మోదీ సూచించారు. 

ఇలా రిజర్వేషన్లపై బిజెపి, కాంగ్రెస్ ల మధ్య వాడివేడి గా వాగ్వాదం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ పేరు వినిపిస్తోంది. రిజర్వేషన్లపై కుట్ర ఆర్ఎస్ఎస్ పనేనని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళుతోంది.ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయాన్ని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. 

ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తుందని... అది కల్పించిన రిజర్వేషన్లను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అసవరం వున్నంతకాలం వాటిని కొనసాగించాల్సిందేనని ... ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటోందని అన్నారు. సమ సమాజ స్థాపన జరిగేవరకు రిజర్వేషన్లు వుండాలని మోహన్ భగవత్ స్పష్టం చేసారు. 

నేటి సమాజంలో ఇంకా అసమానతలు వున్నాయని... అవి తొలగిపోవాలంటే రిజర్వేషన్లు వుండాలన్నారు. కానీ కొందరు రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమంటూ ప్రచారం చేస్తున్నారని... ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని... తద్వారా సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని  మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios