అరుంధతి లో జేజమ్మగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఎంతగా మారిపోయిందో కదా!
అనుష్క కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉంది అరుంధతి. ఈ చిత్రంలో చిన్నప్పటి జేజమ్మ పాత్ర చేసి చిన్నారి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.
హీరోయిన్ అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఇందులో అనుష్క చిన్నప్పటి క్యారెక్టర్ లో ఓ చిన్నారి చాలా అద్భుతంగా నటించి మెప్పించింది. జేజమ్మ పాత్రలో హుందాగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిది. అనుష్క నటించిన మొదటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి. ఈ చిత్రం 2009 లో విడుదలై భారీ విజయం సాధించింది.
బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పేరు దివ్య నగేష్. అరుంధతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దివ్య నగేష్ కు తన కెరీర్లో మర్చిపోలేని సినిమా గా అరుంధతి నిలిచింది. దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. దివ్య 2004లో తమిళ చిత్రం శైవం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . అనంతరం తెలుగులో అరుంధతి మూవీతో పాపులర్ అయింది.
ఆ క్రమంలో పలు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఆమె కనిపించడం లేదు. కానీ తాజాగా దివ్య నగేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ని మించిన అందంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేనందుకు ఈ బ్యూటీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దివ్య నగేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడు దివ్య చాలా అందంగా ఉందని .. ఆమె హీరోయిన్ మెటీరియల్ .. హీరోయిన్ గా ట్రై చేస్తే బాగుంటుంది అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.