Asianet News TeluguAsianet News Telugu

ధోని స‌రికొత్త రికార్డు.. ఈ చారిత్రాత్మ‌క మైలురాయిని రోహిత్, కోహ్లీలు అందుకోలేకపోయారు..

MS Dhoni Record: ఆదివారం జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజ‌యంలో పాయింట్ల ప‌ట్టిక‌లో చెన్నై టీమ్ మూడో స్థానంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే ధోని సరికొత్త రికార్డు సాధించాడు. 
 

MS Dhoni : MS Dhoni's IPL most winning record.. Rohit sharma and virat Kohli could not reach this historical milestone RMA
Author
First Published Apr 29, 2024, 10:46 AM IST

MS Dhoni - IPL : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ 46వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)-సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో 78 పరుగుల తేడాతో హైద‌రాబాద్ పై చెన్నై విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కు 10 మ్యాచ్‌ల్లో ఇది ఐదో విజయం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 10 పాయింట్లను కలిగి ఉంది. రన్ రేట్ +0.810. టాప్-4లోకి రావ‌డంతో చెన్నై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఐపీఎల్‌లో ధోనీ స‌రికొత్త రికార్డు.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ధోని తప్ప మరే ఇతర క్రికెటర్ ఈ మైలురాయిని సాధించలేకపోయాడు. ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు గెలిచిన తొలి క్రికెటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ ధోనీ స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో టీమ్ అత్యధికంగా 150 సార్లు విజయాన్ని అందుకుంది.

గుజ‌రాత్ ను చెడుగుడు ఆడుకున్నాడు భ‌య్యా.. 6 6 4 6 6.. విల్ జాక్స్ విధ్వంసంతో

ధోని 2008 నుంచి ఐపీఎల్‌లో మొత్తం 259 మ్యాచ్‌లు ఆడాడు. 259 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 150 విజయాలు నమోదు చేశాడు. 259 ఐపీఎల్ మ్యాచ్‌లలో 39.53 సగటుతో 5178 పరుగులు చేయ‌గా, ఇందులో 24 అర్ధ సెంచరీలు కొట్టాడు ధోని, అత్యుత్తమ స్కోరు 84 పరుగులు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ప్ర‌స్తుతం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ధోని ఐపీఎల్ 2024లో క్రికెటర్‌గా ఆడుతున్నాడు. ధోనీ త‌ర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా ధోని రికార్డు

1. మహేంద్ర సింగ్ ధోని – 150 విజయాలు

2. రోహిత్ శర్మ - 133 విజయాలు

3. రవీంద్ర జడేజా - 133 విజయాలు

4. దినేష్ కార్తీక్ - 125 విజయాలు

5. సురేష్ రైనా - 122 విజయాలు

VIRAT KOHLI : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు..

Follow Us:
Download App:
  • android
  • ios