Asianet News TeluguAsianet News Telugu

KKR vs PBKS : సునీల్ న‌రైన్ విధ్వంసం.. దుమ్మురేపిన ఫిల్ సాల్ట్..

Kolkata Knight Riders vs Punjab Kings : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మ‌రోసారి కేకేఆర్ బ్యాట‌ర్లు దుమ్మురేపుతూ ప‌రుగుల వ‌ర‌ద పారించారు. 
 

KKR vs PBKS : Sunil Narine's destruction.. Super innings by Phil Salt IPL 2024 RMA
Author
First Published Apr 26, 2024, 11:02 PM IST

KKR vs PBKS : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురుస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారుతోంది. మ‌రోసారి కేకేఆర్ బ్యాట‌ర్లు రాణించ‌డంతో 250+ భారీ స్కోర్ ను సాధించింది. ఓపెన‌ర్లు సునీల్ న‌రైన్, ఫిల్ సాల్ట్ లు అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరు జ‌ట్ల‌లో స్వ‌ల్ప మార్పులు జ‌రిగాయి.  లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో జానీ బెయిర్‌స్టో తిరిగి వచ్చాడు. అలాగే, రూ.24.75 కోట్ల విలువైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్‌కతా త‌ప్పించింది. అతని స్థానంలో దుష్మంత చమీరకు అవకాశం దక్కింది.

కేకేఆర్ ఓపెన‌ర్ల ప‌రుగుల సునామీ..

పవర్‌ప్లేలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 15 బంతుల్లో 38 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు తలో 2 సిక్సర్లు బాదారు. పంజాబ్ ఆటగాళ్లు వీరిద్దరికీ ఒక్కో లైఫ్ ఇచ్చారు. మూడో ఓవర్ రెండో బంతికి సునీల్ నరైన్ క్యాచ్ మిస్సయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన బంతిని హర్ ప్రీత్ బ్రార్ క్యాచ్ పట్టలేకపోయాడు. అదే సమయంలో, ఆరో ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ సామ్ కర్రాన్ తన క్యాచ్‌ను వదిలేశాడు. అర్ష్‌దీప్ సింగ్ బంతికి ఫిలిప్ సాల్ట్ క్యాచ్ పట్టలేకపోయాడు. దీంతో ఇద్దరు ప్లేయర్లు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. 

20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. అందుకు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ జోరుగా ఇన్నింగ్స్ ఆడారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు, సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేశారు. వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశారు. 5 పరుగుల వద్ద రింకూ సింగ్ ఔటయ్యాడు. రమణదీప్ సింగ్ 3 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా 2 వికెట్లు తీశాడు. శామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. సునీల్ నరైన్ మరోసారి దుమ్మురేపాడు. 71 పరుగుల తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఫిల్ సాల్ట్ 75 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. 


 

 

17 ఏళ్ల వయస్సులో అంజలి ప్రేమలో.. మారువేషంలో డేట్.. సచిన్ టెండూల్కర్ 'లవ్ స్టోరీ'.. 

Follow Us:
Download App:
  • android
  • ios